వారఫలాలు ( ఫిబ్రవరి 8‌‌–14):  నాలుగు గ్రహాలు స్థానాలు మారాయి.. ఈ వారం 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

వారఫలాలు ( ఫిబ్రవరి 8‌‌–14):  నాలుగు గ్రహాలు స్థానాలు మారాయి.. ఈ వారం 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (ఫిబ్రవరి 8 నుంచి 14   వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం.

మేషరాశి :  ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.  ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి.  కాని అతి కష్టంమీద పూర్తి చేస్తారు.   ఈ రాశి వారు  ఈ వారం చాలా వరకు అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ఉద్యోగస్తులు అనవసరంగా మాటపడే పరిస్థితులు ఉన్నాయి.  కాబట్టి ప్రతీ విషయానికి కోపానికి గురి కాకుండా ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోండి.  ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులుసూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. వారం చివరిలో ఇబ్బంది పడే విషయాల్లో ఉపశమనం కలుగుతుంది. 

 వృషభరాశి :  ఈ వారం ఈ  రాశి వారికి  ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి.  ఖర్చులను నియంత్రించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.   ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు సమతుల్యంగా ఉంటాయి.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.  ఉద్యోగుల విషయంలో సహోద్యోగుల మద్దతుఉంటుంది. నిరుద్యోగులకు ఈ వారం మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. 

మిథున రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.   వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది.  కార్యాలయంలో  కీలకపాత్ర పోషించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.   ఉద్యోగం మారేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆదాయం తో పాటు.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఎలాంటి ఆందోళన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు

కర్కాటక రాశి : ఈ రాశి వారికి  వారం ప్రారంభంలో ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత పెరుగుతుంది.  కెరీర్‌లో స్థిరత్వం ఉంటుంది.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.   వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది.  కార్యాలయంలో  కీలకపాత్ర పోషించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.   ఉద్యోగం మారేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆదాయం తో పాటు.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఎలాంటి ఆందోళన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు

 సింహ రాశి :  ఈరాశి వారి కి ఈ వారంలో  ఆర్థిక విషయంలో చాలా కాలంగా ఉన్న అడ్డంకులను అధిగమిస్తారు.   కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.  ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేపట్టినా విజయ వంతం అవుతుంది.  డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి.. ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.  ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి . ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.  

 కన్య రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం  పెరిగే అవకాశం ఉంది.  వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది.  వ్యాపారాల విషయాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి... కొద్దిపాటి చికాకులు కలిగే అవకాశం ఉంది.  ఆదాయంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమభారం పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.  ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి.  పెళ్లికోసం ఎదురురుచూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.

తులా రాశి : ఈ రాశి వారు ఈ వారంలో కీలక ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.   కొత్త కెరీర్​ అవకాశాలు ఏర్పడుతాయి.  ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు.  నిరుద్యోగులకు కోరుకున్న జాబ్​ లభిస్తుంది.  అనవసర ప్రయాణాలతో ఖర్చులు అధికమవుతాయి.  ఉద్యోగస్తులకు  ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.వివాహ విషయాలకు సంబంధించిన సమస్యలు  ఈ వారంలో పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈవారం చాలా అద్భుతంగా ఉంటుంది.  గ్రహాలు అనుకూలంగా ఉండటంతో  సమాజంలో గౌరవంతో పాటు గుర్తిపు లభిస్తుంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ప్రశంశలు.. అవార్డులు లభిస్తాయి.  వ్యాపారస్తులు అంచనాలకు మించి లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉంది.  బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  రియల్​ ఎస్టేట్​ వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు.  ఉద్యోగస్తులకు ప్రశంశలు వస్తాయి.   సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆస్తి వివాదాలను పరిష్కరించు కుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  తలపెట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు.  ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

మకర రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులు నెరవేరుతాయి.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  భూ లావాదేవీల వ్యవహారంలో సానుకూల ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు ఆశించన జాబ్​ లభిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.  వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.  ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. 

 కుంభ రాశి:   ఈ రాశి వారు ఈవారం  నూతనోత్సాహంతో  ఉంటారు.  అనుకున్న పనులు వెంటనే చకాచకా పూర్తి చేస్తారు.  అనుకోకుండా చేసే ప్రయాణాలు లాభాలను తెచ్చి పెడతాయి.  ఉద్యోగస్తుల పనితీరుకు మెచ్చిర ఉన్నతాధికారులు అవార్డులు అందజేస్తారు.  ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభించి, భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలను కూడా పొందుతారు. కొత్త అవకాశాలు  మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మీనరాశి: ఈ రాశి వారు  ఈ వారం చాలా వరకు అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ఉద్యోగస్తులు అనవసరంగా మాటపడే పరిస్థితులు ఉన్నాయి.  కాబట్టి ప్రతీ విషయానికి కోపానికి గురి కాకుండా ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోండి.  ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులుసూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. వారం చివరిలో ఇబ్బంది పడే విషయాల్లో ఉపశమనం కలుగుతుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.